విష్ణు విన్యాసం లీక్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు: హీరో శ్రీవిష్ణు

విష్ణు విన్యాసం లీక్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు: హీరో శ్రీవిష్ణు

విష్ణు హీరోగా నటించిన ‘విష్ణు విన్యాసం’ చిత్రం శుక్రవారం విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుందని తెలియజేస్తూ శనివారం ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని  లీక్ చేసి బ్లాక్‌‌ మెయిల్ చేశారని, వాటన్నింటిని ఎదుర్కొని  థియేటర్స్‌‌లో రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుంచి మంచి  రెస్పాన్స్ రావడం  చాలా ఆనందాన్ని ఇచ్చింది శ్రీవిష్ణు చెప్పాడు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నయన్ సారిక, దర్శకుడు యదునాథ్ మారుతీరావు, నిర్మాత సుమంత్ నాయుడు జి పాల్గొన్నారు.  

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌‌‌ 

శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా కిర‌‌ణ్ దర్శకత్వంలో   సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించిన చిత్రం  ‘మృత్యుంజ‌‌య్‌‌’.  మార్చి 6న సినిమా విడుదల  కానుంది.  ఇప్పటికే ఈ మూవీ టీజర్‌‌‌‌ను రాజమౌళి రిలీజ్ చేయగా, శనివారం ట్రైలర్‌‌‌‌ను  విడుదల చేసిన ఎన్టీఆర్.. ఇది  సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌‌‌లా ఉందని చెబుతూ టీమ్‌‌కు బెస్ట్‌‌ విషెస్‌‌ను అందించాడు. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌‌గా రాబోతోన్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు చాలా కొత్తగా కనిపించబోతోన్నాడు. కాల భైరవ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌‌గా నిలిచింది.