కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ మొదటి మీటింగ్‌లోనే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. శనివారం కౌన్సిల్ హాల్ లో చైర్ పర్సన్ షాహిన్ సుల్తానా అధ్యక్షతన మొదలైన సమావేశం 20 నిమిషాల్లోనే ముగిసింది. స్టేజీ పైన చైర్పర్సన్, కమిషనర్ తిరుపతికి మాత్రమే కుర్చీలు వేయగా వైస్ చైర్ పర్సన్ కొత్తపల్లి అనితకు స్టేజీపై సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టుబట్టారు. అలాంటి నిబంధనలు లేవని కమిషనర్ చెప్పి మీటింగ్ ముగించారు. దీనికి నిరసనగా ఆఫీస్ ఎంట్రెన్స్ వద్ద 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, వైస్ చైర్ పర్సన్ అనితతో కలిసి
బైఠాయించారు.
