Mahesh Babu: యుద్ధవిద్య ‘కళరిపయట్టు’ నేర్చుకున్న మహేష్ బాబు.. కీలక విషయాలు వెల్లడించిన ట్రైనర్‌

Mahesh Babu: యుద్ధవిద్య ‘కళరిపయట్టు’ నేర్చుకున్న మహేష్ బాబు.. కీలక విషయాలు వెల్లడించిన ట్రైనర్‌

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఇప్పటికే వారణాసి టీజర్ రాకతో మూవీపై అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే  ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి ఛాయలున్న రుద్రుడిగా కనిపించబోతున్నారు. పొడవాటి జుట్టు మరియు గుబురు గడ్డం పెంచడంతో పాటు శారీరకంగా కొన్ని కిలోల బరువు పెరిగి గంభీరంగా కనిపిస్తున్నారు. 

ఈ తరుణంలో మహేష్ బాబు పాత్రకి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వైరల్ అవుతుంది. పవర్‌ఫుల్‌ పాత్ర అయిన "రుద్రుడిగా" మారేందుకు పురాతన యుద్ధ కళలైన ‘కళరిపయట్టు’లో మహేష్ బాబు శిక్షణ పొందినట్లు స్పెషల్ ట్రైనర్ హరిక్రిష్ కాకాని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన హరిక్రిష్ కాకాని.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు వారణాసి కోసం ఈ ట్రైనింగ్‌ ఇచ్చారు. లేటెస్టుగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకోవడంతో పాటుగా ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఫొటోస్ షేర్ చేస్తూ తన ఆనందాన్నిషేర్ చేసుకున్నారు.

వారణాసిలో మహేష్ బాబు సాహసికుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్‌లోని ఒక సన్నివేశానికి, సూపర్‌స్టార్ కలరిపయట్టులో శిక్షణ పొందాల్సి వచ్చింది. మరియు ఆ సన్నివేశాన్ని ప్రామాణికంగా మరియు సహజంగా చూపించడానికి, కఠినమైన శిక్షణ కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన కళరిపయట్టును మహేష్ నేర్చుకున్నారని మార్షల్ ఆర్ట్ ట్రైనర్ హరిక్రిష్ కాకాని తెలిపారు. అయితే, మహేష్‌కు పురాతన మార్షల్ ఆర్ట్స్ రూపంలో శిక్షణ ఇవ్వడం గర్వంగా మరియు ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. 

►ALSO READ | Ravi Babu Film: నీళ్ల గ్లాసులో కత్తిరించిన చెవి.. ఉత్కంఠరేపుతున్న డైరెక్టర్ రవి బాబు కాన్సెప్ట్..

ట్రైనర్ హరిక్రిష్ మాటల్లో.. ‘‘నేను గత సంవత్సరం మహేష్ బాబు సర్‌కు ట్రైనింగ్ ఇచ్చాను. కానీ సరైన టైం వచ్చేవరకూ ఈ విషయాన్ని లీక్ చేయకూడదని రాజమౌళి బృందం కోరింది. అందువల్ల ఈ ప్రెస్టీజియస్ మూమెంట్ ఇప్పటివరకూ ఎక్కడ వెల్లడించలేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు వర్క్‌ చేస్తానని అనుకోలేదు. ఈ ఏడాది జనవరిలో వారణాసి షూటింగ్‌కు వెళ్లే ముందే మహేష్ సర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నారు. కలరిపయట్టు కూడా అందులో భాగమే. నేను ఆయన కంటే చాలా చిన్నవాడిని కానీ, ఆయన నన్ను గౌరవించిన విధానం చూసి ఆశ్చర్యపోయాను. నేను చెప్పిన ప్రతి పనీ చేసేవారు. మొదట రెండు నెలలు అనుకున్న ట్రైనింగ్‌ తర్వాత మరికొన్ని నెలలు పొడిగించాం’’ అని హరిక్రిష్ వెల్లడించారు. ఇపుడు ఈ క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

మహేష్ బాబు పరివర్తన.. 

కలరికి వేగం, చురుకుదనం మరియు శరీర భాగాల సమన్వయం అవసరం. అందుకే మహేష్ బాబు సమతుల్యత మరియు శరీర వశ్యత, ఓర్పు & సత్తువ మరియు నాడీ కండరాల ఏకీకరణలో శిక్షణ పొందాడు. అందులో భాగంగానే మహేష్ శక్తివంతమైన ఫస్ట్ లుక్ రుద్రుడిగా పవర్ ఫుల్ పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. రక్తంతో కప్పబడిన త్రిశూలం పట్టుకుని ఎద్దుపై స్వారీ చేయడం మహేష్ అభిమానులు మరియు ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచింది. గతంలో ఈ యుద్ధ విద్యను ‘కాంతర’ కోసం రిషబ్‌ శెట్టి, ‘ఇండియన్‌ -2’ కోసం కాజల్‌ నేర్చుకున్నారు. ఈ మూవీ 2027 సమ్మర్ లో రిలీజ్ కానుంది.