సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటేనే ఎంతో టాలెంట్, సాహసం ఉండాలి. అలాంటిది ఒక నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణించడం అంటే.. మాములు విషయం కాదు. పడిపోయిన ప్రతిసారి నటుడుగా, దర్శకుడిగా కొత్త కోణం చూపిస్తూనే ఉన్నారు యాక్టర్ కం డైరెక్టర్ మల్టీ టాలెంటెడ్ రవిబాబు (Ravi Babu). సీనియర్ నటుడు చలపతి రావు కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి నటుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ రచయితగా, ఓ దర్శకుడిగా విలక్షణతను నిరూపించుకుంటూ వస్తూనేఉన్నారు.
లేటెస్ట్గా (23 డిసెంబర్ 2025న) డైరెక్టర్ రవిబాబు తన కొత్త సినిమా అనౌన్స్ చేశారు. తన మార్క్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ఒక టేబుల్పై ఉంచిన నీళ్ల గ్లాసులో కత్తిరించిన చెవి, దాని పక్కనే కట్టర్, రక్తం మరకలతో చేతి.. ఇలా చుట్టూ మర్డర్ ప్రదేశం”తో పోస్టర్ ఉత్కంఠ పెంచేలా ఉంది. ఈ కొత్త మూవీకి సంబంధించిన టైటిల్, కాన్సెప్ట్ గ్లింప్స్ రేపు బుధవారం ఉదయం 10:30 నిమిషాలకు విడుదల కానుంది.
ఇప్పటికే, డైరెక్టర్ రవిబాబు తనదైన సినిమాలతో మంచి బెంచ్ మార్క్ని సెట్ చేసుకున్నారు. రేపు నటీనటులతో పాటుగా మూవీ కాన్సెప్ట్పై మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇకపోతే, ఈ చిత్రాన్ని ఫ్లైయింగ్ ఫ్రాగ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
A #RaviBabu film.
— Ramesh Pammy (@rameshpammy) December 23, 2025
Title glimpse out tomorrow, 10:30 am.#FlyingFrogs @sureshprodns pic.twitter.com/bTlgVDuQhv
దర్శకుడిగా రవిబాబు సినిమాలు:
- అల్లరి
- అమ్మాయిలు అబ్బాయిలు
- సోగ్గాడు
- పార్టీ
- అనసూయ
- నచ్చావులే
- అమరావతి
- మనసారా
- నువ్విలా
- అవును
- లడ్డూ బాబు
- అవును 2
- అదుగో
- అవిరి
- క్రష్
- యెనుగు తొండం ఘటికాచలం.
దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ‘ఏనుగు తొండం ఘటికాచలం’ నవంబర్ 13, 2025న నేరుగా ఓటిటిలోకి వచ్చింది. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్లో అందుబాటులో ఉంది. ఇందులో సీనియర్ నటుడు నరేష్, రవిబాబు, ఆలీ, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, గిరిధర్, విజయ భాస్కర్, వర్షిణి, ప్రశాంతి, శిరీష జూనియర్ రేలంగి తదితరులు నటించారు.
