కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 18వ వార్డులో మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆదేశాలతో శనివారం రూ.11లక్షల విలువైన 2 సోలార్ హైమాస్ట్ లైట్లు, మూడు సెంట్రల్ లైటింగ్ సిస్టంను స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పల్లె శ్రీదేవి, కాంగ్రెస్ లీడర్ రాజు ప్రారంభించారు.18వ వార్డులో స్ర్టీట్ లైటింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మంత్రి చొరవ చూపారని కౌన్సిలర్ పేర్కొన్నారు. ఠాగూర్‌నగర్, అశోక్‌నగర్‌లో స్ర్టీట్లైటింగ్ కోసం సింగరేణి ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
సీసీ రోడ్డు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
చెన్నూరు, వెలుగు: మున్సిపల్ పట్టణంలోని 9వ వార్డు లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు చీల రాధమ్మ ఇంటి నుంచి పులి ప్రభాకర్ ఇంటి వరకు సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించారు. మంత్రి వివేక్ మున్సిపల్ ఎన్నికల ముందు పట్టణంలో ప్రారంభించిన సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనులను పూర్తి చేశారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెద్దింటి పద్మ, పట్టణ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ చెన్నసూర్యనారాయణ, కాంగ్రెసు నాయకులు సుశీల్ కుమార్, చెన్న వెంకన్న, బ్రహ్మయ్య పాల్గొన్నారు.
