కొండగట్టు, వెలుగు: కొండగట్టు దేవస్థానం ఆలయ ఈవో శ్రీకాంతరావు బదిలీ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ ఆలయానికి బదిలీ చేస్తూ శనివారం ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మధ్యాహ్నం టైంలో బదిలీ ఉత్తర్వులు రాగా.. కొండగట్టు ఆలయానికి చెందిన ఇద్దరు అర్చకులను, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లను ఈవో సస్పెండ్ చేస్తున్నట్లు వాట్సాప్ లో వార్త చక్కర్లు కొట్టింది.
దీనిపై ఆలయ ఏఈవో పరిహరనాథ్‌ను వివరణ కోరగా ఈవో శ్రీకాంత్‌రావు ఆదేశాల మేరకు వాట్సప్ ద్వారా నలుగురికి సస్పెన్షన్ లెటర్లు పంపామని తెలిపారు. కాగా రాత్రి ఈవో శ్రీకాంత్‌రావుకు 30 రోజులపాటు లీవ్ సాంక్షన్ చేస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
