‘వీ6 వెలుగు’లో కథనాలపై స్పందన.. ఎగవేత మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం: అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్

‘వీ6 వెలుగు’లో కథనాలపై స్పందన.. ఎగవేత మిల్లర్లపై చర్యలు తీసుకుంటాం: అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో ఎగవేత మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ లక్ష్మీకిరణ్ హెచ్చరించారు. ‘వీ6 వెలుగు’ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్ర, శనివారం వరుసగా ‘అక్రమ మిల్లర్లకు ఆఫీసర్ల అండ!’,  ‘డీఫాల్ట్ మిల్లర్లకు రిజిస్ట్రేషన్ బంద్’ హెడ్డింగ్ లతో ప్రచురితమైన స్టోరీలపై శనివారం ఆమె స్పందించారు. రైస్ మిల్లుల నుంచి సీఎంఆర్ బకాయి రూ.173.78 కోట్లు ఉందని, ఇంకా 43,486 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. జిల్లాలో 2011–12 నుంచి 2023–-24 వరకు జిల్లాలో 109 రైస్ మిల్లర్లు డీఫాల్ట్ అయ్యారని, వారి నుంచి రూ.306.85కోట్ల విలువైన 82,191 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉందన్నారు.

 ఇప్పటివరకు 81 మంది డీఫాల్ట్ మిల్లర్ల నుంచి 38,705 మెట్రిక్ టన్నుల బియ్యం, డబ్బుల రూపేణా, బ్యాంక్ గ్యారంటీ రూపేణా రికవరీ చేశామని,  వాటి విలువ 133.07 కోట్లు ఉంటుందన్నారు. అలాగే 12 మంది రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు, ఆర్ఆర్ యాక్ట్  పెట్టినట్లు వెల్లడించారు. ఇటీవల డీఫాల్ట్ మిల్లర్లకు సంబంధించిన బకాయిలను సన్నబియ్యం రూపంలో చెల్లించడానికి ప్రభుత్వం 90 రోజులపాటు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 24తో ముగిసిందని, ఈ గడువులోపు 1,060 టన్నుల బియ్యం 10 మంది డీఫాల్ట్ మిల్లర్ల నుంచి సేకరించినట్లు తెలిపారు. గడువు ముగిసినందున బకాయి ఉన్న మిగతా మిల్లర్లపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.