రాజన్న సిరిసిల్ల, వెలుగు : మండి బిర్యానీ తిని పది మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సిరిసిల్ల పట్టణానికి చెందిన నేరెళ్ల రాహుల్, రోశన్, పంగ అక్షిత్, కొల్లపూరి ప్రదీప్ తో పాటు మరో ఇద్దరు, ఇల్లంతకుంట మండలానికి చెందిన నలుగురు యువకులు గురువారం పట్టణంలోని ఓ రెస్టారెంట్ లో మండి బిర్యానీ తిన్నారు. కొద్ది సేపటి తర్వాత వాంతులు, విరేచనాలు, జ్వరం, ఒళ్లునొప్పులతో అస్వస్థతకు గురయ్యారు.
కొందరు బాధితులు స్థానిక ప్రభు త్వ హాస్పిటల్ లో, మరికొందరు ప్రైవేట్ హాస్పి టల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా, మరో ముగ్గురు యువకులు ఇంటి వద్దే డాక్టర్ల పర్యవే క్షణలో ఉన్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయినట్లు డాక్టర్లు ప్రాథమికం గా గుర్తించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.
కాగా, జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ అనూష పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గత నెల 20న తంగళ్లపల్లి మండల కేంద్రంలో పానీ పూరి తిని 22 మంది చిన్నారులు అస్వస్థతకు గురి కాగా, ఈ నెల 1న ఓ స్వీట్ హౌస్ లో కొన్న మిక్చర్ లో బల్లి కనిపించింది.
దీంతో మున్సిపల్ ఆఫీ సర్లు స్వీట్ హౌస్ ను మూయించి రూ.లక్ష ఫైన్ వేశారు. వరుస ఘటనలు జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎలాంటి తనిఖీలు నిర్వహించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు
