హైదరాబాద్, వెలుగు: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ను కేసీఆర్ కుటుంబం వాడుకొని వదిలేయడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆరోపించారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. గురువారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దోచుకున్న డబ్బులతో కేసీఆర్.. బీఎస్పీకి ఆర్ఎస్ ను నాయకత్వం వహించేలా చేశారని, దళిత జాతిని ఉపయోగించుకునే నాయకుడు ఆర్ఎస్ తప్ప, వారికి ఉపయోగపడే వ్యక్తి కాదన్నారు. కేసీఆర్ కు గులాంగిరి చేయడం కోసమే తొమ్మిదేండ్లు ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని సంపత్ కుమార్ విమర్శించారు.
