ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలి..పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలి..పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ యూ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.  హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై దిల్ సుఖ్ నగర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా పీడీఎస్ యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం వెంకటరెడ్డి, ఏ సాంబ మాట్లాడుతూ...  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి కావస్తున్నా నేటికీ విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను విడుదల చేయకుండ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12 వేల కోట్ల పైగా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని విడుదల చేయకుండ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.