ఎన్నికల కోడ్ ఉల్లంఘటన కేసు.. మెదక్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ అరెస్ట్

ఎన్నికల కోడ్ ఉల్లంఘటన కేసు.. మెదక్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ అరెస్ట్

మెదక్, వెలుగు: మెదక్ మున్సిపల్ మాజీ చైర్​ పర్సన్, బీఆర్ఎస్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరేళ్ల మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో ప్రవేశ పెట్టగా జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్  బెయిల్ మంజూరు చేశారు.  కేసు వివరాలను టౌన్ సీఐ మహేశ్‌‌‌‌‌‌‌‌ వివరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఫిబ్రవరి 9న పట్టణంలోని పిట్లంబేస్‌‌‌‌‌‌‌‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ కుటుంబంపై మల్లికార్జున్ గాడ్, మల్లారెడ్డిపేటకు చెందిన గణేశ్‌‌‌‌‌‌‌‌, శ్రీను, సురేశ్‌‌‌‌‌‌‌‌, తదితరులు దాడికి యత్నించారు.

 దీంతోపాటు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నాడని ఆరోపిస్తూ, బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఇమ్రాన్ భార్య, పిల్లలు, సోదరిని బెదిరిండంతోపాటు రాత్రంతా ఇంట్లోనే నిర్బంధించినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. మల్లికార్జున్ గౌడ్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల మంజూరు చేసినట్లు వివరించారు. 

 బీఆర్ఎస్ లీడర్లపై కేసులు దారుణం 

మెదక్, వెలుగు: మెదక్ మున్సిపల్ మాజీ చైర్​పర్సన్ మల్లికార్జున్ గౌడ్‌‌‌‌‌‌‌‌పై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అంతకుముందు పద్మా దేవేందర్ రెడ్డి మెదక్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా మరో కొత్త కేసులో మల్లికార్జున్ గౌడ్ ను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రోజుకో కేసుతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.