నాగోబా ఆలయ పరిసరాల్లో.. ఫొటో, షూటింగ్ పై నిషేధం..ఆదివాసీల కీలక నిర్ణయం

నాగోబా ఆలయ పరిసరాల్లో.. ఫొటో, షూటింగ్ పై నిషేధం..ఆదివాసీల కీలక నిర్ణయం

ఇంద్రవెల్లి, వెలుగు: నాగోబా ఆలయ పరిసరాల్లో ప్రీ వెడ్డింగ్, ఫొటో షూట్ పై నిషేధం విధిస్తూ మెస్రం వంశీయులు తీర్మానించారు. ఆదివాసీ పెద్దలతో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు శనివారం తెలిపారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ లు చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దలు బాదిరావు పటేల్, నాగనాథ్, నాగోబా ఆలయ చైర్మన్ ఆనంద్ రావు, పూజారి షేకు, సర్పంచ్ తుకారాం, ఉద్యోగులు పాల్గొన్నారు.