ఫిడే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ చెస్‌‌‌‌ టోర్నీ.. ఫైనల్లో ప్రజ్ఞానంద

ఫిడే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ చెస్‌‌‌‌ టోర్నీ..  ఫైనల్లో ప్రజ్ఞానంద

బాకు (అజర్‌‌‌‌బైజాన్‌‌‌‌) : ఇండియా యంగ్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద.. ఫిడే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ చెస్‌‌‌‌ టోర్నీలో సంచలనం సృష్టించాడు. సోమవారం జరిగిన సెమీస్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌ టైబ్రేక్‌‌‌‌లో ప్రజ్ఞానంద 3.5–2.5తో వరల్డ్‌‌‌‌ మూడో ర్యాంకర్‌‌‌‌ ఫబియానో కరువానా (అమెరికా)కు షాకిచ్చి ఫైనల్లోకి అడుగుపెట్టాడు. క్లాసికల్‌‌‌‌ గేమ్‌‌‌‌ 1–1తో డ్రా కాగా టైబ్రేక్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అద్భుతమైన ఎత్తులతో అలరించాడు. ఫైనల్లో ప్రజ్ఞానంద.. మాగ్నస్‌‌‌‌ కార్ల్‌‌‌‌సన్‌‌‌‌ (నార్వే)తో తలపడతాడు.