Viral Video: వీడు గ్రేట్.. నిమిషంలో 42 కొబ్బరికాయలు పగలకొట్టాడు

Viral Video:  వీడు గ్రేట్.. నిమిషంలో 42 కొబ్బరికాయలు పగలకొట్టాడు

సాధారణంగా వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం కోసం కొన్ని ఏళ్లపాటు కష్టపడి ఒక ప్రత్యేకమైన ప్రతిభను తమలో నింపుకొని ఇక గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా వరల్డ్ బుక్ రికార్డుల్లో చూసుకుంటే ఎక్కువ ఎన్నో విచిత్ర విచిత్రమైన పనులు చేసి రికార్డులు సాధించిన వారు చాలామంది ఉంటారు. ఈ క్రమంలోనే రికార్డు సాధించడం కోసం వారు చేసిన పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి.

కర్ణాటకలోని ముదుర్ ప్రాంతానికి చెందిన మార్షల్ ఆర్టిస్ట్ కేవీ సైదలవి ఒక్క నిమిషంలో 42 కొబ్బరికాయలను నాన్ చాకుతో పగలగొట్టాడు.చుట్టూ కూర్చున్నవారు తలపై కొబ్బరికాయలు పగిలిన కొద్దీ మరొకటి పెట్టుకుంటూ ఉండగా.. సైదలవి వాటిని పగలగొడుతూ వచ్చాడు. కేవలం నిమిషం వ్యవధిలోనే ఈ కార్యక్రమాన్ని ముగించాడు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. సైదలవి మొదట మెల్లగా మొదలుపెట్టినా తర్వాత వేగం అందుకున్నాడని.. ప్రపంచ రికార్డు సృష్టించాడని గిన్నిస్ ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. అవేదో కోడిగుడ్లు అన్నట్టుగా పగలగొట్టేస్తున్నాడు. కొబ్బరికాయలను తలపై పెట్టి కొట్టడమేంటి?” అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 మార్షల్ ఆర్టిస్ట్ కెవి సైదలవి  వాలంటీర్లు కూడా వృత్తాకారంలో కూర్చుని తమ తలపై కొబ్బరికాయలు ఒక్కొక్కటిగా పెట్టుకోగా.. అతను నుంచాకుతో కొబ్బరికాయలను  కొట్టడాన్ని చూపించారు. ఇక మార్షల్ ఆర్ట్స్ లో అయిదు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు సైదలవి.. ఇప్పటికే తన ప్రతిభను నిరూపించి నాలుగు రికార్డులను సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఒకే నిమిషంలో 42 కొబ్బరికాయలు కొట్టడం కొత్త రికార్డు సాధించాడు.