‌‌రైఫిల్‌ షూటింగ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో భారత్‌కు బంగారు పతకాలు

‌‌రైఫిల్‌ షూటింగ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో  భారత్‌కు బంగారు పతకాలు
  • తోమర్​ హిస్టారిక్​ గోల్డ్​
  • మెన్స్​ 50మీ. రైఫిల్​ 3 పొజిషన్స్​లో ఇండియాకు తొలి పసిడి

న్యూఢిల్లీ: ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఇండియా షూటర్ల జోరు కొనసాగుతోంది. విమెన్స్‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ను మనోళ్లు క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేయగా.. మెన్స్‌‌‌‌ 50 మీటర్స్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ త్రీ పొజిషన్స్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌ సింగ్‌‌‌‌ తోమర్‌‌‌‌ ఇండియాకు తొలి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ అందించి చరిత్ర సృష్టించాడు. అంతేకాక వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచిన యంగెస్ట్​ ఇండియన్‌‌‌‌గాను 20 ఏళ్ల తోమర్​ రికార్డులకెక్కాడు. ఫైనల్‌‌‌‌లో ప్రతాప్‌‌‌‌ సింగ్‌‌‌‌ తోమర్‌‌‌‌ 462.5 స్కోరు సాధించి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచాడు. వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌, హంగేరికి చెందిన ఇస్తావాన్‌‌‌‌ పెనీ(461.6), డెన్మార్క్‌‌‌‌కు చెందిన స్టీఫెన్‌‌‌‌ వోల్సెన్‌‌‌‌(450.9)తో వరుసగా తర్వాతి ప్లేస్‌‌‌‌లు సాధించారు. ఇక, విమెన్స్‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ ఫైనల్లో ఇండియాకు చెందిన చింకీ యాదవ్‌‌‌‌, రాహీ సర్నోబత్‌‌‌‌, మనూ బాకర్‌‌‌‌ వరుసగా గోల్డ్‌‌‌‌, సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ సాధించారు.