V6 News

కానిస్టేబుల్తో వెట్టి చాకిరీ చేయిస్తున్న ఖమ్మం సీఐ .. ఇల్లు శుభ్రం చేయిస్తున్న వీడియో వైరల్

కానిస్టేబుల్తో వెట్టి చాకిరీ చేయిస్తున్న ఖమ్మం సీఐ .. ఇల్లు శుభ్రం చేయిస్తున్న వీడియో వైరల్

ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన కానిస్టేబుల్స్ ఇండ్లు క్లీన్ చేయాల్సిన పరిస్థితి. రోడ్డుపై సిగ్నల్ దగ్గర విధులు నిర్వహించాల్సిన సిబ్బంది.. ఇంట్లో పనిమనిషిలా మారిన వైనం. అధికారం ఉంది కదా అని కింది స్థాయి ఉద్యోగులను పనిమనిషుల్లా చూసే పరిస్థితి ఇంకా మారక పోవడం ఆందోళన కలిగించే అంశం. కానిస్టేబుళ్లను పనిమనుషుల్లా వాడుకుంటున్న ఖమ్మం జిల్లా సీఐ నిర్వాకం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఖమ్మం ట్రాఫిక్ సీఐ  బెల్లం సత్యనారాయణ తీరు వివాదాస్పదంగా మారింది. బదిలీ అయిన కానిస్టేబుల్ బాలాజీని రిలీవ్ చేయకుండా తన వద్దనే ఉంచుకుని, ఇంటి పని చేయిస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. సీఐ సొంత ఊరు కేశావపురంలో కానిస్టుబల్ తో తన ఇంటిని శుభ్రం చేయిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

కానిస్టేబుల్ తో కొద్ది రోజులుగా పనులు చేయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి పనులతో పాటు, పెరటి తోలను కూడా క్లీన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో బయటకు రావటంతో సీఐపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా, కింది స్థాయి ఉద్యోగులను సొంత పనులకు వాడుకున్న సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.