ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 16న ప్రారంభమై ఏప్రిల్ 30న ముగుస్తుంది.
పోస్ట్ పేరు: జూనియర్ అసిస్టెంట్.
మొత్తం ఖాళీలు: 180.
తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండ 1, హైదరాబాద్ సికింద్రాబాద్ 19, కరీంనగర్ 1, మహబూబ్‌నగర్ 1, నిజామాబాద్ 1, సిద్దిపేట 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌ను ఆపరేట్ చేసే పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 16.
అప్లికేషన్ ఫీజు: అందరు అభ్యర్థులు రూ.800 చెల్లించాలి.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 30.
ఆన్‌లైన్ ఎగ్జామ్ (తాత్కాలికం): 2026, జూన్ మొదటివారం.
సెలెక్షన్ ప్రాసెస్: మొదట ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.lichousing.com ను సందర్శించండి.
ఆన్‌లైన్ పరీక్షా విధానం
ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 200 మార్కులు కేటాయించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు 50 మార్కులు (35 నిమిషాలు), లాజికల్ రీజనింగ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు (35 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు (15 నిమిషాలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు (35 నిమిషాలు) ఇస్తారు.
ప్రతి విభాగానికి నిర్ణీత సమయం ఉంటుంది. ఆ సమయం పూర్తయ్యాకే తదుపరి విభాగానికి వెళ్లాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉన్నది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 (1/4వ వంతు) మార్కు కోత విధిస్తారు. కాబట్టి తెలిసిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వడం మంచిది. పరీక్ష కేవలం ఇంగ్లిష్ భాషలో మాత్రమే ఉంటుంది.
అర్హత మార్కులు: అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ కనీస మార్కులు సాధించడంతో పాటు ఓవరాల్‌గా కూడా కట్-ఆఫ్ మార్కులను సాధించాల్సి ఉంటుంది.

