ఆకాశం ఎందుకో  ఎర్రబడ్డది..చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో ఎరుపెక్కిన నింగి

ఆకాశం ఎందుకో  ఎర్రబడ్డది..చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌లో ఎరుపెక్కిన నింగి

 

  • దంతెవాడ, కిరండోల్ దృశ్యాలు వైరల్
  • అర్నబ్ తుపాను ఎఫెక్టా.? మరేదైనానా?
  • వివరాలు వెల్లడించని వాతావరణశాఖ 


న్యూఢిల్లీ: చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పలు ప్రాంతాల్లో ఆకాశం రక్తవర్ణంలోకి మారింది. ఎర్రని ఆకాశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారాయి. అర్నబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుపాను కారణంగా ఆకాశంలో ధూళి, పొగ, నీటి బిందువులు, మేఘాల పరిస్థితులు కలిసి ఇలా రంగు మారి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోలోని దంతేవాడ, కిరండూల్, జగదల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ ప్రాంతాల్లో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో సూర్యకాంతి వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో ఎరుపు, నారింజ రంగులు స్పష్టంగా కనిపిస్తాయి. దీన్ని రేలీ స్కాటరింగ్ అంటారు. ఇది సాధారణంగా రోజూ చాలా ప్రాంతాల్లో ఏర్పడేదే. కానీ చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో రోజంతా ఆకాశం ఎరుపు రంగులో కన్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

నిపుణులు ఏమంటున్నారు?

తుపాను కారణంగా వీచిన బలమైన ఈదురుగాలులు భూమిపై ఉన్న ఐరన్ (ఇనుము) లవణాలు ఎక్కువగా ఉండే ఎర్రటి మట్టిని, దుమ్మును భారీగా ఆకాశంలోకి తీసుకెళ్లాయని నిపుణుల ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తుపాను కారణంగా మేఘాల్లో ఏర్పడిన నీటి బిందువులు, ఈ ఎర్రటి దుమ్ము కణాల నుంచి సూర్యకాంతి ప్రసరించినప్పుడు ఆకాశం భయంకరంగా, రక్తం రంగులో కనిపిస్తుందని చెబుతున్నారు. ఇలాంటి దృశ్యాలు గతంలో ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తుపాన్లు వచ్చినప్పుడు కనిపించాయని వెల్లడించారు.