ఖేలో ఇండియా ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమోదీని పిలవండి : మంత్రి వాకిటి శ్రీహరి

ఖేలో ఇండియా ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమోదీని పిలవండి : మంత్రి వాకిటి శ్రీహరి
  • కేంద్ర క్రీడల మంత్రి మాండవీయాకు మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాండవీయాను కోరారు. ఈ పోటీల ద్వారా తెలంగాణలోని క్రీడా సదుపాయాలు, యువతలో ఉన్న ప్రతిభను దేశానికి చాటిచెప్పే చాన్స్​ఉంటుందన్నారు. గేమ్స్​ను ప్రధాని మోదీ ప్రారంభిస్తే జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభిస్తుందని, గ్రామీణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి గురువారం కేంద్ర మంత్రి మాండవీయాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఖేలో ఇండియా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు, క్రీడా వేదికల సిద్ధత, మౌలిక సదుపాయాలు, రవాణా, వసతి, భద్రత తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథారిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై అధికారులు పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అధికారులకు దిశానిర్దేశం చేశారు.