ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్ దాడి.. రైలును ఢీకొట్టిన డ్రోన్

ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్ దాడి.. రైలును ఢీకొట్టిన డ్రోన్
  • ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రష్యా డ్రోన్ దాడి.. 13 మంది మృతి
  • ద్నీప్రోలో ఆగి ఉన్న రైలును ఢీకొట్టిన జెట్ పవర్డ్ డ్రోన్ 
  • మరో 10 మందికి గాయాలు

కీవ్: ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ద్నీప్రో రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రష్యా డ్రోన్ దాడి కలకలం రేపింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 13 మంది చనిపోగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. ద్నీప్రో నుంచి జపోరిజ్జియాకు వెళ్తున్న రైలు స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆగి ఉండగా ఈ దాడి జరిగింది. రైలు నంబర్ 866ను జెట్ పవర్డ్ డ్రోన్ ఢీకొట్టినట్టు ఉక్రెయిన్ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రయాణికులు ఉండటంతో ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రష్యా దాడులపై ప్రపంచ దేశాలు కఠిన చర్యలు తీసుకోవాలని జెలెన్స్కీ డిమాండ్ చేశారు. 

రష్యా ఇంధన రంగంపై ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా దాడులు ఆగడం లేదని ఆయన ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. ద్నీప్రో మేయర్ బోరిస్ ఫిలాటోవ్ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పౌర విద్యుత్ రైలును డ్రోన్ ఢీకొట్టిందని వెల్లడించారు. ఉక్రెయిన్ రవాణా వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో రష్యా రైల్వే సౌకర్యాలపై దాడులు పెంచుతోందని అధికారులు ఆరోపిస్తున్నారు. 

జెట్ పవర్డ్ డ్రోన్లతో షాపింగ్ సెంటర్లు, పెట్రోల్ బంకులు, విద్యుత్ ప్లాంట్లు సహా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ రైల్వే సంస్థ ఉక్రజలిజ్నిట్సియా లెక్కల ప్రకారం, 2026లో ఇప్పటివరకు స్టేషన్లు, లోకోమోటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ప్రయాణికుల బోగీలు సహా 1,700కు పైగా రైల్వే సౌకర్యాలపై దాడులు జరిగాయి.