- విచారణ జరపాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో అరబ్ పార్టీలు భారీ అక్రమాలకు పాల్పడ్డాయని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి ఆరోపించారు. ఎన్నికల్లో విదేశీ శక్తుల జోక్యం దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిందని ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో విదేశీ నిధుల వినియోగంపై విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ జస్టిస్ నోఅమ్ సోల్బర్గ్, దేశీయ నిఘా సంస్థ షిన్ బెట్ చీఫ్ డేవిడ్ జీని కోరారు.
ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ నెతన్యాహు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.‘‘రామ్ గేట్ వ్యవహారం ఒక తీవ్రమైన పరిణామం.విదేశీ శక్తులు ఎన్నికల్లో జోక్యం చేసుకుని ఓటర్లను కొనుగోలు చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఎన్నికలను దొంగిలించాయి’’ అని అరబ్ లీడ్ రామ్, జాయింట్ లిస్ట్ కూటమిపై మండిపడ్డారు.
ఇస్లామీకరణకు యత్నం
దేశంలో ఇస్లామీకరణను ప్రోత్సహించడం కోసమే ఈ జోక్యం వెనుక ఉన్న లక్ష్యమని నెతన్యాహు ఆరోపించారు. ఇది ఇరాన్‌తో జరుగుతున్న పోరాటంలో ఇజ్రాయెల్ సైన్యాన్ని బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఏ జియోనిస్ట్ పార్టీ కూడా రామ్ లేదా జాయింట్ లిస్ట్‌తో పొత్తు పెట్టుకోకూడదని విజ్ఞప్తి చేశారు. విదేశీ నిధుల వ్యవహారంపై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఈసీ చీఫ్ నోఅమ్ సోల్బర్గ్ షిన్ బెట్ చీఫ్‌ను తన లేఖ ద్వారా కోరారు.
హంగ్ దిశగా పలితాలు
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. నెతన్యాహు కూటమికి 53 సీట్లు, ఐసన్ కోట్ కూటమికి 48, అరబ్ పార్టీలకు 19 సీట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది.ప్రభుత్వ ఏర్పాటులో అబ్బాస్ నేతృత్వంలోని రామ్, జాయింట్ లిస్ట్ పార్టీలు కీలకమవ్వనున్నాయి.
