కర్ణాటకలో పాల ధరలకు రెక్కలు.. లీటర్‌పై ఏకంగా రూ.8 పెంపు!

కర్ణాటకలో పాల ధరలకు రెక్కలు.. లీటర్‌పై ఏకంగా రూ.8 పెంపు!

బెంగళూరు: కర్నాటకలో పాల ధరలను లీటరుకు ఏకంగా రూ.8 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్నాటక సీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. లీటరుకు రూ.8 నుంచి 10 వరకు పెంచాలని మిల్క్ యూనియన్లు కోరిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

బేసిక్ టోన్డ్ మిల్క్ ధర ప్రస్తుతం లీటర్​కు రూ.46 ఉండ గా, తాజా పెంపుతోరూ.54 కు పెరగనుంది. మరోవైపు కొత్తగా పెంచిన ధరల్లో రూ.7 నేరుగా పాల ఉత్పత్తిదారులకు, రూపా యి మిల్క్ యూనియన్లకు చేరు తుందని కర్నాటక మంత్రి కృష్ణ బైరేగౌడ వెల్లడించారు. ఈ నిర్ణ యం ద్వారా పాడి పరిశ్రమపై ఆధార పడిన దాదాపు 10 లక్షల రైతు కుటుంబా లకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.