ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా.. డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్..

ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా.. డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్..

రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లుగా బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య పాత్రలో నటించిన  సినిమా ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. శరత్ దర్శకత్వంలో దీపక్ నిర్మిస్తున్నారు. గురువారం టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌కు అతిథిగా హాజరైన  రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘బేబీ  పరిణితతో సినిమాని తీసేందుకే దర్శకుడు, నిర్మాత పుట్టారనిపిస్తోంది. ఆ పాపకు  తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీ ఉండబోతోంది.  

ఈ సినిమా పెద్ద విజయం సాధించి టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ ‘రోలర్ కోస్టర్ రైడ్‌‌‌‌లా సినిమా ఉంటుంది. కుటుంబ విలువల్ని చాటి చెప్పే ఈ చిత్రం ప్రతి ఫ్యామిలీకి  కనెక్ట్ అవుతుంది’ అని చెప్పాడు. 

టీజర్ రిలీజ్ చేసిన విజయేంద్ర ప్రసాద్‌‌‌‌కు థ్యాంక్స్ చెప్పిన దర్శక నిర్మాతలు  ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, నవంబర్ 27న విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. నటులు హాసిని సుధీర్, రాకేష్, బేబీ పరిణిత ఈ చిత్రంలో నటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.