బ్లాస్టింగ్ లతో మల్లన్న సాగర్ కు ముప్పు: మాజీ మంత్రి హరీశ్ రావు

బ్లాస్టింగ్ లతో మల్లన్న సాగర్ కు ముప్పు: మాజీ మంత్రి హరీశ్ రావు

మెదక్​/తొగుట, వెలుగు: బ్లాస్టింగ్​లతో మల్లన్నసాగర్​ కు ప్రమాదం పొంచివుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు అన్నారు. మూసీ సుందరీకరణ కోసం నీటిని తరలించేందుకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టకు కేవలం 150 మీటర్ల దూరంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ బ్లాస్టింగ్స్ చేస్తున్నారని, దీంతో కట్టకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గురువారం మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన ఆయన, రిజర్వాయర్ కట్టతో పాటు బ్లాస్టింగ్స్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ ఇరిగేషన్ నిబంధనల ప్రకారం కట్ట ఎత్తుకు పది రెట్ల దూరం అంటే 400 మీటర్ల పరిధిలో బ్లాస్టింగ్స్, నిర్మాణాలు చేపట్టకూడదని తెలిపారు. అయినా కేవలం 150 మీటర్ల దూరంలోనే రెండు, మూడు నెలలుగా భారీ పేలుళ్లు జరుపుతున్నారని ఆరోపించారు. బ్లాస్టింగ్స్ ప్రభావంతో కిలోమీటరు దూరంలోని తిప్పారంలో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, రాత్రివేళ పేలుళ్ల ధాటికి ఇళ్లలోని వస్తువులు కిందపడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారని పేర్కొన్నారు. 

పేలుళ్ల తర్వాత రిజర్వాయర్ కట్ట సమీపంలో సీపేజీ పెరిగిందని, కట్ట పక్కన రాళ్లు కూలిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పనులు నిలిపివేయాలని ఆఫీసర్లకు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. మరోవైపు, పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్లు, పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణలో రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. 

అక్రమ బ్లాస్టింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసులు నమోదు చేసి బాధ్యులైన కాంట్రాక్టర్, ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, బక్కి వెంకటయ్య తదితరులు ఉన్నారు. 

మంత్రి ఉత్తమ్​కు లేఖ..

మల్లన్నసాగర్​ రిజర్వాయర్​ భద్రతను గాలికొదిలేసి చేపడుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్​ చేస్తూ హరీశ్​రావు మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. నిపుణుల అనుమతి లేకుండా ముందుకెళ్తే ప్రజలతో కలిసి పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.