లక్ష్మారెడ్డి బాగోతం బయటపెడతా : జడ్చర్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

లక్ష్మారెడ్డి బాగోతం బయటపెడతా : జడ్చర్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  •     కనీసం ఆయన కాంపౌండర్‌‌‌‌‌‌‌‌కు కూడా అర్హుడు కాదు
  •     ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

జడ్చర్ల / మిడ్జిల్, వెలుగు : ​దసరా పండుగకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని డబ్బులడగడానికి తానేమైనా బ్రోకరా అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మారెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలన్నీ బయటపెడుతానని హెచ్చరించారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మూడేండ్లలో అభివృద్ధి చేయలేదన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శలను ఖండించారు. 

సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉదండాపూర్ భూ నిర్వాసితులకు రూ.650 కోట్లు విడుదల చేయించడంతో పాటు, ఒక్కో గ్రామ పంచాయితీకి రూ.5‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 లక్షలు మంజూరు చేయించినట్టు, రూ.1.90 కోట్లు, మహిళా సంఘాలకు రూ.కోటితో పెట్రోల్​ పంపు మంజూరు చేయించినట్లు తెలిపారు.  దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు జడ్చర్లకు వచ్చిన సీఎం రేంవత్​రెడ్డిని  డబ్బుల గురించి అడుగడం భావ్యమేనా అని ప్రశ్నించారు. లక్ష్మారెడ్డి గతంలో  కేసీఆర్ వద్దకు ప్రతిసారీ భూముల పైరవీల కోసమే వెళ్లేవాడని ఇటీవలే తెలిసిందని, ఆయన మంత్రి పదవికే కాక కాంపౌండర్‌‌‌‌‌‌‌‌కు కూడా అర్హుడు కాదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో శుక్రవారం లక్ష్మారెడ్డి బాగోతాన్ని బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు.