దేశంలోని భిన్న సంస్కృతులను తెలుసుకోండి..విద్యార్థులు సాంస్కృతిక వారధులుగా నిలవాలి: గవర్నర్‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌ శుక్లా

దేశంలోని భిన్న సంస్కృతులను తెలుసుకోండి..విద్యార్థులు సాంస్కృతిక వారధులుగా నిలవాలి: గవర్నర్‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌ శుక్లా
  •     రవీంద్రభారతిలో సౌత్ ఇండియన్ కల్చరల్​ అసోసియేషన్ 68వ వార్షిక కళల ఉత్సవం

రవీంద్రభారతి, వెలుగు: విద్యా పర్యటనలను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా.. ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని గవర్నర్‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌ శుక్లా విద్యార్థులకు సూచించారు. సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్(హైదరాబాద్) 68వ వార్షిక కళల ఉత్సవం గురువారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలోని భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు, జీవన విధానాలను తెలుసుకోవడం ఏక్‌‌‌‌ భారత్‌‌‌‌ శ్రేష్ఠ భారత్‌‌‌‌ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ ప్రజలకు పరిచయం చేయడంతోపాటు, తెలంగాణ ప్రత్యేకతలను ఈశాన్య రాష్ట్రాలకు చాటిచెప్పే సాంస్కృతిక వారధులుగా విద్యార్థులు నిలవాలని ఆకాంక్షించారు. గవర్నర్‌‌‌‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిశోర్‌‌‌‌, సంయుక్త కార్యదర్శి కొమండూరు శశికిరణ్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌ విశ్వవిద్యాలయం నోడల్‌‌‌‌ ఆఫీసర్​డా.ఎస్‌‌‌‌.అరుళ్మొజి, ఇతర అధికారులు, లెక్చరర్లు పాల్గొన్నారు.