అస్తానా: ఇండియా స్టార్ రెజ్లర్ సుజిత్ కల్కల్ వరుస 24 విజయాల జైత్రయాత్రకు చెక్ పడింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన మెన్స్ 65 కేజీల క్వార్టర్‌ఫైనల్లో సుజిత్ 3–3 (క్రైటీరియా ఆధారంగా)తో అబ్దుల్మజిద్ కుదియేవ్ (తజకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. గత ఏడాది కాలంలో సుజిత్ ఏడు టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. అండర్–23 వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన అతను జాగ్రెబ్ వరల్డ్ చాంపియన్‌షిప్ రెప్‌చేజ్ రౌండ్‌లో ఓడిన తర్వాత మళ్లీ ఈ టోర్నీ వరకు ఒక్క మ్యాచ్‌లోనూ పరాజయం చవిచూడలేదు.
వరుసగా 24 మ్యాచ్‌లు నెగ్గినా.. ఈసారి మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. తొలి పీరియడ్ ముగియడానికి ఐదు సెకన్ల ముందు సుజిత్ టేక్‌డౌన్ ద్వారా 2–1 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ వెంటనే మరో పాయింట్‌తో 3–1 లీడ్‌లో నిలిచాడు. కానీ చివరి 30 సెకన్ల మ్యాచ్ నాటకీయంగా మారింది. మ్యాట్ అంచున జరిగిన పోరులో ఇరు రెజ్లర్లు పట్టుకోసం తీవ్రంగా శ్రమించారు. చివరికి రివ్యూలో తజికిస్తాన్ రెజ్లకు అనుకూలంగా తీర్పు రావడంతో స్కోరు 3–-3తో సమమైంది. మ్యాచ్ చివరి పాయింట్ సాధించిన నిబంధన (క్రైటీరియా) ఆధారంగా కుదియేవ్‌కు విజయ్ దక్కింది. విమెన్స్ 72 కేజీల రెప్‌చేజ్ రౌండ్‌లో తను శర్మ 5–4తో జైనబ్ సైఘిర్ (ట్యూనీసియా)పై గెలిచి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. విమెన్స్ 59 కేజీల సెమీస్‌లో మనీషా భన్వాలా ‘విన్ బైఫాల్’ ద్వారా అల్టిన్ షాగాయేవా (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.
