నిమ్స్, నయా ఉస్మానియాపనులు స్పీడప్ చేయాలి :  మంత్రి దామోదర రాజనర్సింహ

నిమ్స్, నయా ఉస్మానియాపనులు స్పీడప్ చేయాలి :  మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: నిమ్స్ విస్తరణ, గోషామహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో నిర్మిస్తున్న కొత్త ఉస్మానియా హాస్పిటల్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ రెండు కీలక ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై గురువారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులు 23 శాతం, నిమ్స్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాన్షన్  పనులు 80 శాతం పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు.  నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.