- 164 టన్నుల కల్తీ సరుకు స్వాధీనం
- వ్యాపారి, ఆటోడ్రైవర్లపై పీడీయాక్ట్
- చర్లపల్లి జైలుకు తరలించిన మల్కాజ్గిరి పోలీసులు
మల్కాజ్గిరి, వెలుగు: రైతులను మోసం చేస్తున్న కల్తీ ఎరువుల తయారీదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశతో ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ ఎరువులు తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిపై మల్కాజ్గిరి పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. నిందితులు మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ప్రతాప సింగారానికి చెందిన వ్యాపారి చెరుపల్లి రవి, హయత్‌నగర్ గ్రీన్ అవెన్యూ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్రొడావత్ మంగ్తా నాయక్ అలియాస్ దాది మంగ్తా అలియాస్ మణిలను గురువారం అరెస్ట్‌చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు.
నిందితుల వద్ద నుంచి 164 మెట్రిక్ టన్నుల నకిలీ ఎరువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అన్నదాతల కష్టాన్ని దోచుకునే నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల వ్యాపారులను ఉపేక్షించేది లేదని మల్కాజ్గిరి సీపీ సుమతి హెచ్చరించారు.
