V6 News

రూ.2.65 కోట్లు కొట్టేసిన బ్యాంక్ అటెండర్.. దేవరకొండ ఎస్బీఐలో కాంట్రాక్ట్ ఉద్యోగి నిర్వాకం

రూ.2.65 కోట్లు కొట్టేసిన బ్యాంక్ అటెండర్.. దేవరకొండ ఎస్బీఐలో కాంట్రాక్ట్ ఉద్యోగి నిర్వాకం
  • ఖాతాలకు తన మొబైల్​ నంబర్​ అటాచ్​ చేసి మోసం

దేవరకొండ, వెలుగు: నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ బ్రాంచిలో కాంట్రాక్ట్ అటెండర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న చక్రపాణి రూ.2.65 కోట్లు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దేవరకొండకు చెందిన చక్రపాణి మూడేళ్లుగా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తూ బ్యాంక్ సిబ్బందితో సఖ్యతగా ఉండేవాడు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో కేవైసీ అప్‌‌‌‌‌‌‌‌డేట్ వంటి పనులను సిబ్బంది తమ ఐడీలతో అతనితో చేయించేవారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న చక్రపాణి మొబైల్ నంబర్ లేని ఖాతాలను గుర్తించి, వాటికి తన ఫోన్ నంబర్ అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేశాడు. అనంతరం నెట్ బ్యాంకింగ్ ద్వారా హైదరాబాద్, వరంగల్ శాఖలకు చెందిన ఖాతాల నుంచి డబ్బును తన స్నేహితుల ఖాతాల్లోకి బదిలీ చేసి, తర్వాత తన ఖాతాకు మార్చుకునేవాడు.

ఇలా పలువురి ఖాతాదారుల నుంచి రూ.2.65 కోట్లు మోసం చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఓ ఖాతాదారుడికి మనీ ట్రాన్స్​ఫర్​పై మెసేజ్ రావడంతో విషయం బయటపడింది. బ్యాంకు అధికారులు పరిశీలించగా దేవరకొండ బ్రాంచ్ నుంచి మోసం జరిగినట్లు తేలింది. చక్రపాణి స్నేహితుడి ఖాతాలో రూ.89 లక్షలు ఉండటంతో దాన్ని ఫ్రీజ్ చేశారు. బ్యాంక్ మేనేజర్ ఫణీంద్ర ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చక్రపాణి పరారీలో ఉన్నాడు.