V6 News

హాఫ్ సెంచరీతో చెలరేగిన గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే!

హాఫ్ సెంచరీతో చెలరేగిన గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే!

KKR vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ లో పాయింట్ల పట్టికలో బోణీ కొట్టాలని ఆశపడ్డ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు నరేంద్ర మోడీ స్టేడియంలో మరోసారి "చుక్కలు" కనిపించాయి. గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకే ఆలౌట్ అయిపోయంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కెప్టెన్ రహానే నిర్ణయం పూర్తిగా "మిస్ ఫైర్" అయింది. ఇక బ్యాటింగ్ లో రహానే ఎదుర్కొన్న మొదటి బంతికే (గోల్డెన్ డక్) అవుట్ అయి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. ఇక పవర్‌ప్లే ముగిసేసరికి 37 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. టిమ్ సీఫెర్ట్ (19), రఘువంశీ (8) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు.

గ్రీన్ క్లాస్– రింకూ ఫ్లాప్: 
కష్టాల్లో ఉన్న జట్టును వన్ డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ తన అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా గ్రీన్ ( 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 79 పరుగులు) మాత్రం వన్ మ్యాన్ ఆర్మీలా పోరాడాడు. రోవ్‌మన్ పావెల్ (27) కాసేపు మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అందరూ ఎంతో ఆశగా ఎదురు చూసిన ఫినిషర్ రింకూ సింగ్ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి రబాడ బౌలింగ్‌లో వెనుదిరగడం కేకేఆర్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది.

చెలరేగిన గుజరాత్ బౌలర్లు: 
కగిసో రబాడ 3 కీలక వికెట్లు తీసి కేకేఆర్ నడుం విరిచాడు. ఇక మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ చెరో 2 వికెట్లతో రాణించగా.. రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. చివర్లో రమణదీప్ సింగ్ (17) కొన్ని భారీ హిట్లు కొట్టినా, సునీల్ నరైన్ డకౌట్ అవ్వడం.. కార్తీక్ త్యాగి రనౌట్ అవ్వడంతో కేకేఆర్ కథ 180 పరుగులకే ముగిసింది. అయితే 181 రన్స్ లక్ష్యాన్ని ఛేదించడం గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద కష్టమేమీ కాదు.. ముఖ్యంగా జోస్ బట్లర్, శుభ్‌మన్ గిల్ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్ ఈజీగా గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ కేకేఆర్ బౌలర్లు చెలరేగితే మ్యాచ్ ఉత్కంఠంగా మారే ఛాన్స్ ఉంది.