V6 News

రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాం: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై రాహుల్ రియాక్షన్

రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాం: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై రాహుల్ రియాక్షన్

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడం, 2011 జనభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడానికి ఉద్దేశించి లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లు ఆమోదం పొందటానికి కావాల్సిన మూడింట రెండింతల మెజార్టీ రాకపోవడంతో బిల్లు రిజెక్ట్ అయ్యింది.

ఈ అంశంపై మీడియాతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. మోడీ సర్కార్ రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టామని అన్నారు. ఇది ముమ్మాటికీ మహిళా బిల్లు కాదని.. యాంటి నేషనల్ యాక్ట్ అని పేర్కొన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2023 మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్‎తో ముడిపెట్టొదని పునరుద్ఘాటించారు. 

ఎన్డీయే కూటమికి షాక్ .. మోదీ సర్కార్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. లోక్ సభలో మొత్తం 528మంది ఎంపీలు ఓట్లు వేశారు.అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు మూడింట రెండో వంతు మెజార్టీ ఉండాలి. అంటే అనుకూలంగా 358ఓట్లు రావాల్సి ఉండగా.. కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కు 54 ఓట్లు తగ్గాయి. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన మెజార్టీ రాకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు లింక్ ఉన్న 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. 

మహిళా కోటాకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడంతో విపక్షాలు పూర్తిగా వ్యతిరేకించారు. డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్లను బీజేపీ పరిగణలోకి తీసుకోకుండా 131 రాజ్యాంగ సవరణ బిల్లు మద్దతు కోసం సభలో ఓటింగ్ కు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. అయితే మ్యాజిక్ ఫిగర్ ఓట్లు రాకపోవడంతో బిల్లు వీగిపోయింది.