V6 News

 SRH vs CSK: ఆరెంజ్ ఆర్మీ vs ఎల్లో ఆర్మీ మధ్య ఉత్కంఠ పోరు.. ఉప్పల్ స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్

 SRH vs CSK: ఆరెంజ్ ఆర్మీ vs ఎల్లో ఆర్మీ మధ్య ఉత్కంఠ పోరు.. ఉప్పల్ స్టేడియంలో జోరుగా ప్రాక్టీస్

SRH vs CSK: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఉప్పల్) స్టేడియంలో రేపు ( 2026, ఏప్రిల్ 18) ఒక భారీ పోరుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.

జోరుగా ప్రాక్టీస్: 
SRH జోరు: కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆధ్వర్యంలో హోమ్ గ్రౌండ్‌లో నెట్స్ లో సన్‌రైజర్స్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తమ పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో మరోసారి భారీ స్కోర్ సాధించేలా ప్రాక్టీస్ చేస్తుండగా, బౌలర్లు పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, షకీబ్ హుస్సేన్, శివమ్ మావి, ఇషాన్ మలింగ, ప్రఫుల్ హింగే బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు.

CSK అదుర్స్: ఫుల్ ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో చెన్నై జట్టు వ్యూహాలకు పదును పెడుతోంది. ఎంఎస్ ధోనీ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతుండగా, బౌలింగ్ విభాగంలో నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్ తీవ్రంగా సాధన చేస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కి సంబంధించి ఉప్పల్ స్టేడియం టిక్కెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. 'ఆరెంజ్ ఆర్మీ' వర్సెస్ 'ఎల్లో ఆర్మీ' పోరును చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఇక పోలీసులు భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా తనిఖీల కోసం స్టేడియం గేట్లను సాయంత్రం 4:30 గంటల నుంచే తెరవనున్నారు. మరి హైదరాబాద్ కోటలో సన్‌రైజర్స్ సత్తా చాటుతుందో లేక చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ కొడుతుందో అనేది వేచి చూడాలి.