లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు అర్హత

లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు అర్హత

న్యూఢిల్లీ: లాస్‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌ వేదికగా జరిగే 2028 ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు అర్హత సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌లో ఆసియా ఖండం నుంచి అత్యుత్తమ స్థానంలో నిలిచిన జట్టుగా ఇండియా ఈ బెర్త్‌‌‌‌‌‌‌‌ను ఖరారు చేసుకుంది. మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది ముగిసేనాటికి ఐసీసీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఆసియా ఖండంలో అగ్రస్థానంలో నిలిస్తేనే నేరుగా క్వాలిఫై అవుతుంది. ఈ మేరకు ఒలింపిక్ అర్హత నిబంధనలను ఐసీసీ సోమవారం అధికారికంగా ప్రకటించింది.

 మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌లో చెరో ఆరు జట్లు మాత్రమే బరిలోకి దిగనున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, సౌతాఫ్రికా కూడా అర్హత సాధించాయి. ఆతిథ్య దేశంగా అమెరికా మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్లకు నేరుగా ఒక ప్లేస్‌‌‌‌‌‌‌‌ లభిస్తుంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో విండీస్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌కు చేరినా ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించలేదు. ఎందుకంటే వెస్టిండీస్ అనేది ఒకే దేశం కాదు, అది బార్బడోస్, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి అనేక కరేబియన్ దేశాల కలయిక. ఒలింపిక్స్ నియమావళి ప్రకారం ఒకే ఒలింపిక్ కమిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌వోసీ) కింద గుర్తింపు ఉంటేనే ఆ దేశానికి అర్హత లభిస్తుంది.