భారత్‌లో తొలి కరోనా పేషెంట్‌కు మళ్లీ పాజిటివ్

భారత్‌లో తొలి కరోనా పేషెంట్‌కు మళ్లీ పాజిటివ్

తిరువనంతపురం: భారత్‌లో తొలి కరోనా పేషెంట్‌కు మళ్లీ వైరస్ సోకింది. నిరుడు జనవరిలో చైనాలోని వుహాన్‌లో ఎంబీబీఎస్‌ చదువుతూ భారత్‌కు తిరిగొచ్చిన 20 ఏండ్ల కేరళ యువతికి ఆ రాష్ట్రంలో హెల్త్ సిబ్బంది టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెనే మన దేశంలో తొలి కరోనా పేషెంట్‌. త్రిసూర్ జిల్లాకు చెందిన ఆమెకు రెండోసారి వైరస్ సోకింది. ఇటీవల ఆమె కాంటాక్ట్ అయిన వ్యక్తికి కరోనా రావడంతో ముందు జాగ్రత్తగా టెస్ట్ చేయించుకుంది. మంగళవారం ఉదయం టెస్ట్ రిపోర్ట్ కరోనా పాజిటివ్ అని రావడంతో, ఆమె హోం ఐసోలేషన్‌లో ఉందని జిల్లా హెల్త్ అధికారులు తెలిపారు. ఆ యువతికి ఎటువంటి లక్షణాలు లేవని, తమ హెల్త్ టీమ్ బేసిక్ కరోనా మెడిసిన్స్ కిట్‌ను అందించిందని చెప్పారు. ఆమె ఇప్పటి వరకు ఒక్క డోస్‌ వ్యాక్సిన్ కూడా తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.