ఆది పినిశెట్టి, హన్సిక లీడ్ రోల్స్‌లో మనోజ్ దామోదరన్ తెరకెక్కించిన చిత్రం ‘పార్ట్నర్’(Partner). ఈ మూవీ గతేడాది ఆగస్టులో తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేద్దామని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ, తెలుగు థియేటర్లను స్కిప్ చేస్తూ కేవలం తమిళంలో రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో తెలుగు థియేటర్లో రిలీజ్ కాకుండా..ఇపుడు డైరెక్ట్ ఓటీటీ బాటలోకి వచ్చేస్తుంది.
ఇదొక సైంటిఫిక్ ఫాంటసీ ఎంటర్టైనర్. హీరో ఆదికి క్లోజ్ ఫ్రెండ్ అయిన యోగిబాబు, ఓ సైంటిస్ట్ ఇంటికి రాబరీకి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో హన్సికగా మారతాడు. తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ. పల్లక్ లల్వానీ ఆది లవర్‌గా కనిపించింది. జాన్ విజయ్, పాండిరాజన్, రోబో శంకర్ ఇతర పాత్రలు పోషించారు.
పార్ట్నర్ ఓటీటీ:
తాజాగా ఈ మూవీ ఆహా తమిళ్ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే, ఈ నెలలోనే పార్ట్నర్ మూవీ తెలుగులోనూ ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తొందరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
Tablet Vaangitengala 🥺
— aha Tamil (@ahatamil) May 8, 2024
Because ‘Partner’ paathu Vayiru valika sirikka porenga 🤣
‘#Partner’ now Streaming on aha 🤩@AadhiOfficial @ihansika @iYogiBabu pic.twitter.com/Ll8vgvNyAb
హన్సిక సినిమాల విషయానికి వస్తే..ఈ మధ్య డిఫరెంట్ స్టోరీస్‌ను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. కానీ,ఆ మూవీస్ బోల్తా పడుతున్నాయి. రీసెంట్ గా హన్సిక నటించిన 105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శృతితో పాటు రిలీజైన హారర్ మూవీ గార్డియన్ కూడా ఫెయిలయ్యాయి.