దేశంలో కరోనా: గడచిన 24 గంటల్లో..

దేశంలో కరోనా: గడచిన 24 గంటల్లో..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16 వేల 561 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 42 లక్షల 23వేల 557కు చేరగా ఇందులో 4 కోట్ల 35 లక్షల 73వేల 94 మంది కోలుకున్నారు.  
 రోజువారీ కేసుల సగటును పరిశీలిస్తే.. గడచిన 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల నమోదైంది. మరో 18 వేల 53 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 49 మంది కరోనా సోకి చికిత్స పొందుతూ  ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే 17 లక్షల 7 వేల మందికి టీకా డోసులు పంపిణీ చేశారు వైద్యాధికారులు. దీంతో ఇప్పటి వరకు 207 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.