V6 News

WTC-2లో టీమిండియా షెడ్యూల్ ఖరారు

WTC-2లో టీమిండియా షెడ్యూల్ ఖరారు

ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఇటీవలే ముగిసింది. రెండో టోర్నీ మొదలు కాబోతోంది. 2021మధ్య 23కు సంబంధించి నిర్వహించే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీలో టీమిండియా పర్యటనల షెడ్యూల్ ఖరారైంది. ఈసారి కూడా మూడు విదేశీ పర్యటనలు, మూడు స్వదేశీ సిరీస్‌లు ఉండనున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఆతిథ్య జట్టుతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. మరో రెండేళ్ల పాటు జరిగే సెకండ్ వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఇదే మొదటి సిరీస్‌.

టీమిండియా షెడ్యూల్:
.. 2021 ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్: ఆగస్ట్ 4,8 మొదటి టెస్ట్‌, ఆగస్ట్ 12,16 రెండో టెస్ట్‌, ఆగస్ట్ 25,29 మూడో టెస్ట్, సెప్టెంబర్ 2,6 నాలుగో టెస్ట్‌, సెప్టెంబర్ 10మధ్య14 ఐదో టెస్ట్‌
.. 2021 న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా : ఫస్ట్ WTC ఫైనల్లో టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌కు రానుంది. విలియమ్సన్‌ సేన రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం భారత్‌కు రానుంది.
.. 2021మధ్య 22 ఇండియా టూర్ ఆఫ్ దక్షిణాఫ్రికా: భారత్‌ ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ గెలవని దేశం ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే. మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాకు వెల్లనుంది.
..2022 శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా: వచ్చే ఏడాది IPL ప్రారంభానికి ముందు మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక.. భారత్‌లో పర్యటించనుంది.
.. 2022 ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా: 2022 అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ ల కోసం ఆస్ట్రేలియా భారత్‌కు రానుంది.
.. 2022 ఇండియా టూర్ ఆఫ్ బంగ్లాదేశ్: WTC 2లో భాగంగా టీమిండియా ఆడే చివరి టెస్ట్ సిరీస్. 2022 చివర్లో రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది.