ఇందిరమ్మ ఇండ్లు గొప్ప కార్యక్రమం : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

ఇందిరమ్మ ఇండ్లు గొప్ప కార్యక్రమం : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు గొప్ప కార్యక్రమమని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రూ.72 వేలు ఇవ్వాలని అంటున్నారని, అందుకు సంబంధించిన విధివిధానాలపై ఇప్పటికే ప్రభుత్వం రివ్యూలు కూడా చేసిందని చెప్పారు. నార్మ్స్​ ప్రకారం అప్లై చేసుకుంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయని చెప్పారు. గురువారం ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడారు. డబ్బుల్లేక ఇబ్బంది పడేటోళ్లు, పైసలు లేనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు.

ఇందిరమ్మ చెప్పినట్టు పేదల ఇల్లంటే మూడు దర్వాజలు, మూడు కిటికీలు, ఒక బాత్రూం, సున్నం వేసిన గోడలని చెప్పారు. ఈ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలగజేసుకోవడంతో.. వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మాట్లాడకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తాను రాజకీయాలు మాట్లాడం లేదని, మాట్లాడాలంటే అందరికన్నా ఎక్కువ మాట్లాడగలనన్నారు. వస్తరా చర్చకు అని సవాల్​ విసిరారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నరో తెలియడం లేదన్నారు. నీతులు మాట్లాడొద్దంటూ అసహనం వ్యక్తం చేశారు.