V6 News

టీ20 సిరీస్‌కు నటరాజన్ దూరం 

టీ20 సిరీస్‌కు నటరాజన్ దూరం 

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆరంభానికి ముందు భారత్‌‌కు ఎదురుదెబ్బ తగిలింది. జోరు మీదున్న స్పీడ్‌‌స్టర్ నటరాజన్‌‌తోపాటు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యారు. గాయాలతో ఉన్న ఈ ఇద్దరినీ ఫిట్‌గా లేనందున పక్కన పెట్టారని సమాచారం. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో వరుణ్ చక్రవర్తి విఫలమయ్యాడని తెలిసింది.

యార్కర్ స్పెషలిస్ట్ తంగరసు నటరాజన్‌ను భుజం గాయం వేధిస్తుండటంతో టీమ్‌‌కు దూరంగా ఉంచారని తెలుస్తోంది. ‘వరుణ్ చక్రవర్తి షోల్డర్ ఇంజ్యురీ నుంచి కోలుకున్నాడనే అతడ్ని ఎంపిక చేశాం. ఈ గాయం వల్ల అతడు ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే ఎన్‌సీఏలో పునరావాసానికి వెళ్లలేదు. సాధారణంగానే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కానీ యోయో టెస్టు పాసవ్వడంలో వరుణ్ రెండుమార్లు ఫెయిల్ అయ్యాడు. కనీసం రెండు కిలో మీటర్ల దూరం పరిగెత్తడంలో విఫలమయ్యాడు’ అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపాడు.