V6 News

వరుసగా ఎనిమిది ఒలింపిక్స్‌‌‌‌ ఆడేసింది!

వరుసగా ఎనిమిది ఒలింపిక్స్‌‌‌‌ ఆడేసింది!

టోక్యో: మామూలుగా అథ్లెట్ల జీవితకాలంలో ఒకటి, రెండు ఒలింపిక్స్‌‌‌‌ ఆడితేనే మహా గొప్ప అనుకునే రోజుల్లో ఉజ్బెకిస్తాన్‌‌‌‌ అథ్లెట్‌‌‌‌ ఒక్సానా చుసోవిటినా వరుసగా ఎనిమిదోసారి ఒలింపిక్స్‌‌‌‌ బరిలోకి దిగి అందర్ని ఆశ్చర్యపర్చింది. అదీ కూడా 46 ఏళ్ల వయసులో అత్యంత కఠినమైన జిమ్నాస్టిక్స్‌‌‌‌ పోటీలో పాల్గొనడం మరింత గొప్ప విషయం. 17 ఏళ్ల వయసులో1992 బార్సిలోనాతో మొదలైన ఆమె ప్రస్థానం టోక్యోతో ముగిసింది. ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ సోవియట్‌‌‌‌ యూనియన్‌‌‌‌కు ప్రాతినిధ్యం వహించిన చుసోవిటినా ఆ తర్వాత జర్మనీ, ఉజ్బెకిస్తాన్‌‌‌‌కు ఆడి రికార్డును కూడా సృష్టించింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లో ఆమె గ్రూప్‌‌‌‌ దశలోనే వెనుదిరిగింది. దీంతో స్టాండింగ్‌‌‌‌ ఒవేషన్‌‌‌‌తో అందరూ గ్రాండ్‌‌‌‌గా వీడ్కోలు ఇచ్చారు. సాధించాలన్న పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని చుసోవిటినా నిరూపించింది.