V6 News

ఇయ్యాల నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ

ఇయ్యాల నుంచి ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 వరకూ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ప్రతిరోజూ ఫస్టియర్ స్టూడెంట్లకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్షలు కొనసాగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్ష కేంద్రాల్లో 4,12,325 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 2,70,583 మంది, సెకండియర్ స్టూడెంట్లు 1,41,742 మంది ఉన్నారు. కాగా, పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికి గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు.