హాస్టల్లో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య.. రంగారెడ్డి జిల్లా కోహెడలో ఘటన

హాస్టల్లో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య..    రంగారెడ్డి జిల్లా కోహెడలో ఘటన

ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కోహెడలోని ఓ కాలేజీ హాస్టల్‌‌‌‌లో ఇంటర్ విద్యార్థి సూసైడ్​ చేసుకున్నాడు. హయత్‌‌‌‌నగర్ సీఐ నాగరాజ్‌‌‌‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన కోమటిరెడ్డి దేవేందర్‌‌‌‌రెడ్డి(17) కోహెడలోని ఓ ఇంటర్​ కాలేజీలో ఎంపీసీ సెకండియర్​ చదువుతూ వారి హాస్టల్​లోనే ఉంటున్నాడు. 

ఇటీవల ఇంటర్ ఫస్టియర్​ ఫలితాల్లో 470 మార్కులకు 466 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. ఈ నెల 2న తండ్రి జలపతిరెడ్డి హాస్టల్‌‌‌‌లో దింపి వెళ్లాడు. గురువారం రాత్రి స్టడీ అవర్ ముగిసిన అనంతరం గదికి వెళ్లిన తోటి స్టూడెంట్స్​ దేవేందర్‌‌‌‌రెడ్డి ఉరి వేసుకుని ఉండటాన్ని గుర్తించి హాస్టల్ వార్డెన్‌‌‌‌కు సమాచారం ఇచ్చారు. 

వార్డెన్ అతడిని కిందకు దించి హయత్‌‌‌‌నగర్‌‌‌‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాలేజీ యాజమాన్య వేధింపుల కారణంగానే దేవేందర్‌‌‌‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ పలు విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.