కార్గిల్‌ లో మళ్లీ అందుబాటులోకి ఇంటర్నేట్‌ సేవలు

కార్గిల్‌ లో మళ్లీ అందుబాటులోకి ఇంటర్నేట్‌ సేవలు

ఆర్టికల్ 370 రద్దు క్రమంలో కార్గిల్ లో ఇంటర్నెట్ సేవలను ఐదు నెలలుగా నిలిపేసింది కేంద్రప్రభుత్వం. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగక పోవడంతో కార్గిల్ వాసులకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు అప్పట్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది. ఆ తర్వాత జమ్ముకశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది. లడఖ్ లో కార్గిల్ లో ఉంది. శాంతిభద్రతలు సాధారణ స్థితికి రావడంతో ఇంటర్నెట్ ను తిరిగి ప్రారంభించాని కొంత కాలంగా కార్గిల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు.అయితే  ఇంటర్నెట్ ను అవసరానికి అనుగుణంగా జాగ్రత్తగా ఉపయోగించాలని ప్రజలకు స్థానిక నేతలు సూచిస్తున్నారు.