కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకున్న వాళ్లకు హార్ట్‌ఎటాక్ వస్తుందా?

కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకున్న వాళ్లకు హార్ట్‌ఎటాక్ వస్తుందా?

కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నవారికి గుండెల్లో గుబులు పుడుతున్నాయి. సిరంఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో సైడ్ ఎఫెట్స్ ఉన్నాయని ఆ కంపెనీ అంగీకరించింది. దీంతో ఒక్కొక్కరుగా వ్యాక్సిన్ తీసుకున్నాక వారికి ఎదురైన దుష్ప్రభావలను చెప్పుకుంటున్నారు. కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ పై వచ్చిన వార్తలపై బాలీవుడ్ యాక్టర్ శ్రేయాస్ తల్పాడే స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక తనకు హార్డ్ ఎటాక్ వచ్చిందని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. 

గతేడాది అక్టోబర్ లో శ్రేయాస్ కు హార్ట్ ఎటాక్ వచ్చిందని చెప్పాడు. దాంతో ఆయన ఆరు రోజులు ఆసుపత్రిలో ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజెంట్ ఆయన ఆరోగ్యం బాగుంది. ఆయన ఆల్కహాల్ తీసుకోరు, సిగరెట్ తాగరు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. అంతే కాదు ఎలాంటి దీర్ఘ కాలిక ఆరోగ్యం సమస్యలు కూడా తనకు లేవని చెప్పారు. అయినప్పటికీ హార్ట్ ఎటాక్ ఎందుకు వచ్చిందో తనకు కూడా తెలియదని అన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నందువల్లే హార్ట్ ఎటాక్ వచ్చిందన ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రక్తం గడ్డ కట్టే లక్షణాలు ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కనిపించాయని వస్తున్న వార్తలు విని ఆయన షాక్ అయ్యానని అన్నారు.