తెలంగాణ మర్లపడ్డది.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే: కేసీఆర్

తెలంగాణ మర్లపడ్డది.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే: కేసీఆర్

ఈ ప్రభుత్వం కొసవరకు వెళ్లేది కాదు..మళ్లీ ఎపుడు  ఎన్నికలొచ్చినా  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కరీంనగర్ లో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కేసీఆర్.. బీఆర్ఎస్ అన్నీ ఇచ్చినా కాంగ్రేస్సోళ్లు ఎక్కువ ఇస్తాం అనే సరికి ఓటు వేశారని చెప్పారు. అత్యాశ కొద్ది జనం కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. తెలంగాణ ఇపుడు మర్లపడ్డదని చెప్పారు. గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు. 

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు తెచ్చామన్నారు కేసీఆర్.  ఆసరా ఫించన్లు  రూ. 200 ఉన్నది 2 వేలకు పెంచామన్నారు. రైతుభీమా వారం తిరిగే లోపు వాళ్ల కుటుంబానికి ఇచ్చామని చెప్పారు.  ప్రభుత్వం ఆదుకుంటుందనే ధీమా రైతులకు ఇవ్వాలి..  బీఆర్ఎస్ సర్కార్ పై రైతులకు నమ్మకం వచ్చిందన్నారు.  అశోక్ ఖురాన్ అనే మిత్రుడి సలహాతోనే రైతులకు స్కీంలు తెచ్చామన్నారు.  తెలంగాణను  సంక్షేమ రంగంలో నంబర్ 1 గా నిలిపామని చెప్పారు.  

55 లక్షల టన్నుల ధాన్యం పండించే తెలంగాణ మూడున్నర కోట్ల  టన్నులకు చేరిందన్నారు.  ఇప్పటి వరకు  రైతుబంధు లేదు, ధాన్యం కొనుగోలు  లేదన్నారు కేసీఆర్.  1000 కోట్ల పెట్టుబడులు పెట్టే కంపెనీ మద్రాసుకు పోయిందని ఆరోపించారు.  జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కష్టపడి రాష్ట్ర స్థాయిని పెంచామన్నారు.  చెరువులు బాగు చేశాం. ప్రాజెక్టులు కట్టామన్నారు.