మ్యాన్లీ లుక్స్ తో మత్తెక్కిస్తున్న.. మహేష్ బాబు లేటెస్ట్ పిక్

మ్యాన్లీ లుక్స్ తో మత్తెక్కిస్తున్న.. మహేష్ బాబు  లేటెస్ట్ పిక్

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)  తన లుక్స్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తాడు. ఎప్పుడు యవ్వనంగా కనిపించే మహేష్ బాబు మరో సారి తన లుక్ ను సోషల్ మీడియా లో పంచుకున్నాడు. లాంగ్ హెయిర్ తో, కళ్లద్దాలు ధరించి ఉన్న రగ్గుడ్ లుక్ పిక్ ఒకటి  ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.  

దీంతో పాటు 'COMMING SOON' అనే క్యాప్షన్ పెట్టడంతో సినిమా కోసమా ? లేక ఏదైనా యాడ్ కోసమా ? అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో నటిస్తుండగా, ఈ కొత్త లుక్ చూసిన ఫ్యాన్స్  ఏ మూవీ కోసమని నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. 

గుంటూరు కారం మూవీ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) తో పని చేయనున్నారు మహేష్.ఈ సినిమాను రాజమౌళి ఒక ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నారు. కాగా.. ఇందులో మహేష్ క్యారెక్టర్‌కు హనుమంతునికి సమానమైన లక్షణాలు ఉంటాయని, అడవిలో అన్ని అసమానతలతో పోరాడిన చరిత్రను కలిగి ఉంటాడని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ మరింత జోష్ లో ఉంటారు.