ఐఫోన్, ఐప్యాడ్ లో ఐఓఎస్ 17 బీటా.... ఐప్యాడ్ ఓఎస్ 17 బీటాను ఎలా డౌన్​లోడ్ చేసుకోవాలంటే..

ఐఫోన్, ఐప్యాడ్ లో ఐఓఎస్ 17 బీటా.... ఐప్యాడ్ ఓఎస్ 17 బీటాను ఎలా డౌన్​లోడ్ చేసుకోవాలంటే..

ఐఓఎస్ 17,  ఐప్యాడ్​ ఓఎస్17 పబ్లిక్ బీటా కోసం జులై వరకు ఎదురు చూడాలా అనుకుంటున్నారా? ఏం అక్కర్లేదు. డెవలపర్ బీటాస్​ను ఇప్పటికిప్పుడు ఎలా ట్రై చేయొచ్చో   ఇక్కడ ఇస్తున్నాం చదివేయండి. వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో యాపిల్ తన ఐఓఎస్ 17, ఐప్యాడ్ ఓఎస్ 17లను ఆవిష్కరించింది. ఐఫోన్ కోసం యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ తరువాతి వెర్షన్స్​ ... ఫేస్​టైమ్​,  మెసేజెస్, ఫోన్​  సహా అనేక యాపిల్ యాప్స్​లో మార్పులు రానున్నాయి. ల్యాండ్ స్కేప్ మోడ్​లో, ఛార్జింగ్​లో ఖాళీగా ఉన్నప్పుడు ఐఫోన్ స్మార్ట్ డిస్ ప్లేగా మారేలా కొత్త స్టాండ్ బై ఫీచర్​ను కూడా కంపెనీ అనౌన్స్​ చేసింది. గత ఏడాది ఐఓఎస్16తో ఐఫోన్​లో వచ్చిన లాక్ స్క్రీన్​ విడ్జెట్ ఫీచర్​ను​ ఐప్యాడ్​ ఓఎస్17లో వస్తుంది. ఐఫోన్, ఐప్యాడ్ యూజర్స్​కి కొత్త జర్నల్ యాప్​ యాక్సెస్​ వస్తుంది. అయితే హెల్త్ యాప్​  మాత్రం ఈ ఏడాది చివరకి ఐప్యాడ్​లోకి వస్తుంది. పబ్లిక్ బీటా రిలీజ్​ చేసినట్టు కాకుండా మీరు యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్​లో భాగంగా ఉంటేనే యాపిల్ డెవలపర్ బీటా రిలీజ్​ అందుబాటులో ఉంటుంది. అందుకుగాను ఏడాదికి 99 డాలర్లు అంటే సుమారు రూ. 8,200 ఖర్చు అవుతుంది. అయితే ఈ డెవలప్​మెంట్​ కోసం జులై వరకు ఆగలేకపోతే ఈ రోజే మొదటి బీటా రిలీజ్​ కోసం పైన్​ అప్​ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే డెవలపర్ ప్రోగ్రామ్​లో ఉంటే ఇక్కడ చెప్తున్న 6 స్టెప్స్​ ఫాలో అయిపోండి. మీ ఐఫోన్, ఐప్యాడ్ లో ఐఓఎస్ 17 బీటా.... ఐప్యాడ్ ఓఎస్ 17 బీటాను ఇలా డౌన్​లోడ్ చేసుకోవాలి.

  • మొదట మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్​లో డాటాను బ్యాకప్ తీసుకోవాలి.
  • యాప్ స్టోర్ నుంచి యాపిల్ డెవలపర్ యాప్​ ఇన్ స్టాల్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేయాలి.
  • అకౌంట్​ >  ఎన్​రోల్​ నౌ మీద ట్యాప్​ చేసి మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్​తో సైన్ ఇన్ కావాలి. తరువాత మీ ఇన్ఫర్మేషన్​ని సబ్మిట్ చేయాలి.
  • ఇండివిడ్యువల్ ఆప్షన్ సెలక్ట్​ చేసి, లైసెన్స్ నిబంధనలను యాక్సెప్ట్​ చేయాలి. తరువాత యాన్యువల్​ ఫీజు కట్టాలి.
  • యాప్​లో ఉండే అకౌంట్ సెక్షన్‌కి వెళ్లి యాపిల్ డెవలపర్ ప్రోగ్రామ్​లో ఎన్​రోల్​ అయ్యారో, లేదో చూసుకోవాలి.
  • తరువాత సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి జనరల్>సాఫ్ట్​వేర్​ అప్​డేట్​>బీటా అప్​డేట్స్​>​ ఐఓఎస్ 17 డెవలపర్ బీటా/ ఐప్యాడ్​ ఓఎస్ 17 డెవలపర్ బీటా పైన ట్యాప్​ చేయాలి.
  • మునుపటి స్క్రీన్ మీద డెవలపర్ బీటా కనిపించే వరకు ఉండాలి. అది కనిపించాక డౌన్ లోడ్  బటన్​ మీద ట్యాప్​ చేసి ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  • మీ డివైజ్​ పాస్ కోడ్ లేదా పాస్ వర్డ్ ఎంటర్​ చేయాలి. ఆ తరువాత టర్మ్స్​, కండిషన్స్​ యాక్సెప్ట్​ చేస్తే అప్​డేట్​ ప్రాసెస్​ మొదలవుతుంది.