Cyber Crime : స్క్రీన్ షాట్ మనీ స్వైపింగ్ స్కాం బయటపెట్టిన మహిళ

Cyber Crime : స్క్రీన్ షాట్ మనీ స్వైపింగ్ స్కాం బయటపెట్టిన మహిళ

ప్రజెంట్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ వాడకుండా ఉండలేము. ఎక్కడికి వెళ్లినా అది రూ.10లైనా, వేలు  అయినా స్కాన్ చేసి టక్కున పే చేస్తున్నాం. లిక్విడ్ క్యాష్ తో చిల్లర సమస్య ఉంటుందని అందురూ ఈసీగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కు అలవాటు పడ్డారు. కానీ వాటిని వాడుకోని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు కొత్త కొత్త టెక్నిక్స్ వాడి అమాయకపు ప్రజల డబ్బు కొట్టేస్తున్నారు. బెంగుళూర్ లో అతిథి అనే మహిళ ఆన్‌లైన్ ఫ్రాడ్ నుంచి ఎలా తప్పించుకుందో ఎక్స్ లో షేర్ చేసింది.  ఇప్పటి వరకు అలాంటి మోసం మీరు ఎక్కడ విని ఉండరు. ఫేక్ మెయిల్స్, బోగస్ వెబ్ సైట్లు క్రియేట్ చేసి, క్రెడిట్ కార్డ్ నెంబర్, పాస్ వర్డ్ లాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సైబర్ క్రైమ్ లకు పాల్పడుతున్నారు.  

ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఓ అన్‌నోన్ నెంబర్ నుంచి అతిథికి కాల్ వచ్చింది. అతను ఆమె తండ్రికి డబ్బులు ఇవ్వాలని.. డైరెక్ట్ ఆయన నెంబర్ కు మనీ పంపుతుంటే ప్రాబ్లమ్ వస్తుందని అన్నారు. అతిథి తండ్రి ఆ డబ్బులు ఆమెకు పంపమని అన్నాడని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ నెంబర్ తనదేనా అని అతను కన్ఫమ్ చేసుకున్నాడు. తన అకౌంట్ తో ఆమెకు డబ్బులు పంపుతాఅని చెప్పాడు. కాల్ కట్ చేసిన కొద్ది సేపటికి ఆమెకు రూ.10 వేలు క్రెడిట్ అయినట్లు, తర్వాత మళ్లీ రూ.30 క్రెడిట్ అయినట్లు ఓ మెస్సెజ్ వచ్చింది. అయితే ఆ మెస్సేజ్ బ్యాంక్ అఫీషియన్ నెంబర్ నుంచి రాలే.. 10 అంకెల అన్ నౌన్ నెంబర్ నుంచి వచ్చింది. 

వెంటనే ఆ వ్యక్తి కాల్ చేసి తాను రూ.3వేలకు బదులుగా పొరపాటున రూ.30వేలు పంపానని.. మిగిలిన డబ్బు తిరిగి పంపమని ఆమెను కాల్ చేసి అడిగాడు. అతిథికి డౌట్ వచ్చి ఓకే నేను మళ్లీ కాల్ చేస్తా అని చెప్పింది. బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ చెక్ చేయగా ఆ వ్యక్తి పంపిన మనీ యాడ్ అవ్వలే.. డబ్బు అకౌంట్లోకి జమకాలే, క్రెడిట్ అయినట్లు మెస్సేజ్ ఎలా వచ్చిందని ఆమె అనుమాతంతో వెంటనే ఆ వ్యక్తి  నెంబర్ బ్లాక్ చేసింది. ఇలా తాను ఓ పెద్ద సైబర్ ఫ్రాడ్ నుంచి తప్పించుకున్నా అని చెప్తూ.. అందర్ని అప్రమత్తంగా ఉండాలని అతిథి ఎక్స్ లో కోరింది. ఎవరిని గుడ్డిగా నమ్మోద్దని, ఆన్‌లైన్  ట్రాన్సాక్షన్స్ విషయాల్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.