జ్యోతిష్యం : అక్టోబర్ 26న శక్తివంతమైన మార్పు.. వృశ్చికంలోకి బుధుడు, మీనంలోకి శని.. త్రికోణ గమనం 12 రాశులపై ఎలా ఉంటుంది..?

జ్యోతిష్యం : అక్టోబర్ 26న శక్తివంతమైన మార్పు.. వృశ్చికంలోకి బుధుడు, మీనంలోకి శని.. త్రికోణ గమనం 12 రాశులపై ఎలా ఉంటుంది..?

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు న్యాయం, ధర్మానికి, కర్మలకు ప్రతీక.  బుధుడు..  తెలివి, కమ్యూనికేషన్, వ్యాపారానికి ప్రతీక. వృశ్చికంలోకి బుధుడు, మీనంలోకి శని అక్టోబర్​ 26 వ తేదీన  త్రికోణ గమనాన్ని  సృష్టించబోతున్నారు.  అంటే  ఈ రెండు గ్రహాలు ఒక దాని నుంచి మరొకటి  ఐదవ ఇంటిలో మరొకటి తొమ్మిదవ ఇంటిలో కలిసి సంచరించనున్నాయి.  బుధుడు.. శని త్రికోణ గమనం  వలన  కొన్ని రాశులపై విశేష ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు.   జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం త్రికోణ గమనం వలన  ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ..!

 మేష రాశి :  ఈ రాశి వారికి ఆలోచన శక్తి పెరుగుతుంది.  ఆర్థిక విషయాల్లో ఏకాగ్రత అవసరమని పండితులు చెబుతున్నారు.  ఖర్చులు అధికంగా ఉంటాయి.  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పరిశోధనలు ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం.  కీలక వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగులకి కూడా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇది మంచి సమయం. వ్యాపారంలో కూడా లాభాలు ఎక్కువగా వస్తాయి.నిరుద్యోగులకి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.

 వృషభ రాశి : శని.. బుధుడు  త్రికోణ గమనం  వలన ఈ రాశి వారు  భాగస్వామ్య ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది.   ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకి కలిసి వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు  ఇది సరైన సమయం. వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా అవకాశాలు వస్తున్నాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితుల ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు

మిధునరాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  శని.. బుధుడు త్రికోణ గమనం  వలన స్థిరాస్థిని సమకూర్చుకొనే అవకాశం ఉంది.  ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ చాలా వరకు పూర్తవుతాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్ విషయంలో గుడ్​ న్యూస్​ వింటారు. ఈ కాలంలో మీ మాటతీరుకు చాలా మంది ఆకర్షితులవుతారు. ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా మీరు మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి అరుదైన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధన లాభం కలగనుంది.

కర్కాటక రాశి: బుధుడు...  శని సంయోగం వలన అనేక లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. వ్యాపారులకు విదేశీ అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఇన్వెస్ట్​ మెంట్ చేసినట్లయితే లాభాలు ఎక్కువగా వస్తాయి.మానసిక ప్రశాంతత కలుగుతుంది. 

సింహరాశి: ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని గడుపుతారు.  మీరు తీసుకొనే నిర్ణయం దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కలుగుతాయి. కొత్త బాధ్యతలు చేపడుతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. భూమికి సంబంధించిన పనులు చేసే వారికి ఈ సమయం ఎన్నో లాభాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది.  అద్భుతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. నిరుద్యోగుకు ఆశించిన జాబ్​ వస్తుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. 

కన్యారాశి: ఈ రాశి వారికి  మిశ్రమ ఫలితాలుంటాయి.  డబ్బు పొదుపు చేస్తారు.  ఇప్పటి వరకు పెట్టిన అనవసర ఖర్చును నియంత్రిస్తారు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ద చూపుతారు.  మీ కొలీగ్స్ సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి.  ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది.  కొత్తగా వాహనాలను కొనుగోలు చేస్తారు.  కొత్తగా లోన్ తీసుకునేందుకు ఆశక్తి చూపుతారు. ఇప్పటివరకు ఉన్న కుటుంబసభ్యుల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. వారం చివర్లో పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.  వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. 

తులారాశి: బుధుడు.. శని.. త్రికోణ గమనం  వలన ఈ రాశి వారు  ఈ సమయంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావడంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.  వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు వస్తాయి.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

వృశ్చిక రాశి :  ఈ రాశి వారు   కొత్త ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.  మీకు ప్రతిష్ఠతో పాటు సోషల్ నెట్ వర్క్ పెరిగే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు  అధికంగా లాభాలు వస్తాయి.   ప్రేమికులు వాదించుకోకండి.  ఉద్యోగస్తులకు  అన్ని విధాలా కలసి వస్తుంది.  ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయి.  అయితే కొన్ని అదనపు ఖర్చులను నియంత్రించుకోండి. కుటుంబంలో ఆనందం...  సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

 ధనుస్సు రాశి  : బుధుడు.. శని త్రికోణ గమనం  వలన  ఈ రాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులు  మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్తగా ఇంటిని నిర్మించేందుకు ప్లాన్ చేస్తారు,  నిరుద్యోగులకు మంచి  ఉద్యోగం వస్తుంది.  ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.  ఆరోగ్యవిషయంలో కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ కెరీర్ ను అభివృద్ది చేసుకొనేందుకు ప్రయత్నిస్తారు.  కుటుంబసభ్యుల మధ్య ఉన్న వివాదాలుపరిష్కారం అవుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. వ్యాపారస్తులు తీసుకున్న నిర్ణయాలు ఆర్థికంగా లాభాన్ని చేకూరుస్తాయి.  ఉద్యోగస్తులకు కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.  

 మకర రాశి :  ఈ రాశి వారు లీడర్​ షిప్​ తీసుకోవలసిన పరిస్థితులు ఉంటాయి.  మీరు  తీసుకున్న నిర్ణయాలకు మంచి స్పందన వస్తుంది.  మీ సంపద పెరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. కొంతకాలం పాటు  రాజభోగాలు అనుభవిస్తారు. మీ సమర్థతకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.ఉద్యోగులకు కార్యాలయంలో విజయం లభించే అవకాశం ఉంది. బుధుడు, శని దేవుని ప్రభావంతో కోర్టు సంబంధిత కేసులలో విజయం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది.

కుంభ రాశి :  శని, బుధుడి  త్రికోణ గమనం  వలన ఈ  రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో తాము చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి. పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలొస్తాయి. ఈ కాలంలో మీ ఆనందం, సంతోషం పెరుగుతుంది.నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  ఇక వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఆర్థిక పరిస్థితిలో అనూహ్యంగా మెరుగుదల కనిపిస్తుంది. సంపాదనతో పాటు దానిని సద్వినియోగం చేయడంలోనూ విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగంలో ప్రమోషన్, మంచి అవకాశాలు. అలాగే, చిరకాల కోరికలు నెరవేరే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

 మీన రాశి :  బుధుడు.. శని  త్రికోణ  గమనం  వలన ఈ రాశి వారికి  అద్భుతమైన ఫలితాలను కలుగుగాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీని వల్ల మీ జీవితంలో వివిధ రకాల మంచి ఫలితాలు లభిస్తాయని భావిస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని చెబుతున్నారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు. ఇతరుల నుండి గౌరవం, మర్యాద పెరుగుతుందని చెబుతున్నారు.  వ్యాపారంలో భారీ విజయం సాధిస్తారని, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని చెబుతున్నారు. అన్ని ప్రయత్నాల్లోనూ మీకు అదృష్టం లభిస్తుందని, కొత్త పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయని భావిస్తున్నారు. కొత్త ప్రయత్నాల్లో మీకు అభివృద్ధి లభిస్తుందని చెబుతున్నారు

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.ఈ కథనంలోని  జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్నిV6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.